- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల విచారణ
దిశ, వెబ్‌డెస్క్: దర్భంగా పేలుళ్ల కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. బాంబు పేలుళ్ల నిందితులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి.. పాట్నా కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి పాట్నాలోనే యాంటీ టెర్రరిస్ట్ కార్యాలయానికి తరలించిన అధికారులు యూపీకి చెందిన హజీజ్ సలీమ్, ఖాఫిల్‌లకు కూడా ప్రమేయం ఉన్నట్టు గుర్తించి.. వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో మాలిక్ బ్రదర్స్ విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో ఉన్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి కెమికల్స్ ఎక్కడ కొన్నారు అన్న విషయంలో అధికారులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆసిఫ్‌నగర్, మల్లాపూర్, సికింద్రాబాద్ పర్సిల్ సెక్షన్ వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికితోడు నిందితులకు ఆర్థిక సాయం చేసింది ఎవరు అన్న కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.