బాదుడు షురూ.. న్యూ ఇయ‌ర్ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

by Anukaran |   ( Updated:2020-12-26 21:26:34.0  )
బాదుడు షురూ.. న్యూ ఇయ‌ర్ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్
X

దిశ‌,వెబ్ డెస్క్ : జ‌న‌వ‌రి 1 నుంచి బండి చేతిలో ఉందిక‌దా అని ఎలాప‌డితే అలా డ్రైవ్ చేశారో అంతే సంగ‌తులు. మీకు వ‌చ్చే జీత‌మంతా చ‌లాన్ల‌కే క‌ట్టాల్సి వ‌స్తుందంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల్ని అరిక‌ట్టేందుకు సీఎం జ‌గ‌న్ జ‌న‌వ‌రి 1,2021 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమ‌లు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌కు సంబంధించిన నిబంధనలకు సవరణ చేస్తూ అక్టోబర్ లో ఇచ్చిన జీవో జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక ఆ జీవో ప్ర‌కారం కొత్త ట్రాఫిక్ ఫైన్స్ ఇలా ఉండ‌బోతున్నాయి.

మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.5వేలు, అతివేగంతో బండిన‌డిపితే రూ. 1000, ఫైన్ విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు. పోలీసులు వాహ‌నాల్ని త‌నిఖీ చేసే స‌మ‌యంలో ఇబ్బంది పెట్టినా రూ.750, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అర్హతలేని వారు డ్రైవ్ చేస్తే రూ.10,000, ప‌ర్మీట్ లేక‌పోతే రూ.10వేలు, డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే రూ.10వేలు, రేసింగ్ లో పాల్గొన్న రూ.5 నుంచి రూ.10వేలు, స్కూల్స్, టెంపుల్స్ ద‌గ్గ‌ర హారన్ కొడితే రూ.వెయ్యి, రెండో సారి అలా చేసినా రూ. 2వేలు ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed