- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీటింగ్ కేసులో ఓ న్యూస్ ఛానెల్ చైర్మన్ అరెస్ట్.. ఏకంగా ఎండీకే టోకరా..
దిశ, షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ పరిధిలో గల ఎంఎస్ఆర్ హౌసింగ్ అండ్ రిసార్ట్స్‌లో 9 ఫ్లాట్ లను మోసపూరితంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన చైర్మన్‌ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కుషాల్కర్ మీడియాకు వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో 20 ఎకరాలలో రోజారాణి అనే మహిళ సాయిసుధాకర్‌ను భాగస్వామిగా చేర్చుకొని ఎంఎస్ఆర్ హౌసింగ్ అండ్ రిసార్ట్స్ పేరిట ఒక వెంచర్‌ను ప్రారంభించారు. ఇందులో డైరెక్టర్‌గా ఉన్న సాయిసుధాకర్ ఎండీ రోజారాణి సంతకాన్ని ఫోర్జరీ చేసి 9 ప్లాట్లను మోసపూరితంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో సుధాకర్ మోసం చేశారని ఎండీ రోజారాణి 2018లో కొత్తూరు పోలీసులను ఆశ్రయించడంతో సాయి సుధాకర్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు హైకోర్టులో పరిధిలో ఉండటంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆలస్యమైందని తెలిపారు. ఇటీవలే ఈ వ్యవహారంపై పూర్తి నివేదికలు రావడం అదేవిధంగా ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇవ్వడంతో సాయి సుధాకర్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు.