- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికొంత కాలం విలియమ్సనే కెప్టెన్
దిశ, స్పోర్ట్స్: వివాదరహితుడు, సౌమ్యుడు అని పేరున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇటీవల కోచ్ గ్యారీతో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కివీస్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం నువ్వంటే నువ్వని కోచ్, కెప్టెన్ గొడవ పడ్డారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కెప్టెన్ విలియమ్సన్‌ను తప్పించడానికి కోచ్ గ్యారీ తెర వెనుక పావులు కదిపాడని, కొత్త కెప్టెన్‌గా లాథమ్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై కోచ్ గ్యారీ స్పష్టతనిచ్చాడు. ‘కేన్ విలియమ్సన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంకా చెప్పాలంటే న్యూజిలాండ్ క్రికెట్‌లో అలాంటి చర్చే జరుగలేదు. విలియమ్సన్ గొప్ప నాయకుడు. అతను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఇక అభిప్రాయభేదాలు అంటారా? జట్టు సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజం’ అని గ్యారీ స్పష్టం చేశాడు.