- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోనే న్యూ ఇయర్ వేడుకలు
న్యూ ఇయర్ అంటేనే కొత్త ఉత్సాహం. నయాసాల్‌కు వెల్కమ్ చెప్పేందుకు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ మందస్తు ప్రణాళికలు రచించుకుంటారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి కేక్ కటింగ్‌తో వేడుకలు మొదలవుతాయి. వేడుకల్లో కేక్‌లకు ప్రత్యేక స్థానం. ముందస్తుగా బేకరీల్లో ఆర్డర్ చేయడం, స్పెషల్‌గా కేక్‌లను తయారీ చేయిచడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, పరిస్థితి మారింది. కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ జోష్తగ్గింది. యువతలో ఆ సందడే కనిపించడం లేదు. కేక్ కటింగ్ల ఊసేలేదు. దీంతో బేకరీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. వేడుకలు ఇంటికే పరిమితం కానున్నాయి. ఇంట్లోనే కేక్ తయారీపై దృష్టిపెట్టారు గృహిణులు.
దిశ, శేరిలింగంపల్లి: న్యూ ఇయర్ సందడి కనిపించడం లేదు. ప్రతీ యేటా నగరంలో కొత్త కళ కనిపించేది. ఎన్ని వీకెండ్ పార్టీలు జరుపుకున్నా ఇయర్ ఎండ్ పార్టీలు అంటే ఆ జోషే వేరుగా ఉండేది. ఈసారి అలాంటి హ డావుడి లేదు. హంగూ ఆర్భాటాలు అంత కన్నా లేవు. అంతా సాదాసీదాగా జరిగిపోతుంది. కరోనా ఎక్కడ కాటేస్తుందో.. అనవసరంగా బయటకు వెళ్లి ఇంట్లో వాళ్లందరికీ కొత్త తలనొప్పి తేవడం అవసరమా..? అనే ఆలోచన చాలామందిలో మదిలో మెదులుతోంది. కొవిడ్ కారణంగా చాలా వరకు బయట ఫుడ్‌ను తినడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. న్యూ ఇయర్ కేక్ సైతం ఇంట్లోనే తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి పెద్దగా కేక్ ఆర్డర్లు కూడా లేవని బేకరీ షాప్‌ల యజమానులు చెబుతున్నారు. డిసెంబర్ 31కి మూడు, నాలుగు రోజుల ముందే కేక్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే బేకరీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ సమయానికే ఒక్కో షాప్ లో 60 నుంచి 100 కిలోల కేక్ ఆర్డర్లు ఉండేవి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని భరద్వాజ్ అనే బేకరీ షాపు యజమాని తెలిపారు. ఇక నగరంలో ప్రముఖ బేకరీ షాప్ కేఎస్ బేకర్స్ ఒక్క డిసెంబర్ 31నాడే ఒక్కో శాఖలో వెయ్యి నుంచి 1200 కేకులు విక్రయించేది. ఇప్పటికైతే మాకు ఒక్క స్పెషల్ ఆర్డర్ రాలేదని స్టోర్ మేనేజర్ నర్సింహ పేర్కొన్నారు.
ఇంట్లోనే కేక్ మేకింగ్..
న్యూ ఇయర్ కోసం బేకరీలు రకరకాల కేక్ లను తయారు చేస్తాయి. అరకిలో నుంచి ఆర్డర్ఇస్తే చాలు ఎంత పెద్దదైనా రెడీ చేస్తుంటాయి. వినియోగదారుల టేస్ట్ ను బట్టి కూల్ కేక్, ప్లం కేక్, బటర్ స్కాచ్, చాక్లెట్, ఎగ్, ఎగ్ లెస్, ఫ్రూట్స్ స్పెషల్ ఇలా ఎన్నో వెరైటీలు తయారు చేస్తుంటా యి. న్యూ ఇయర్ కు కొన్ని బేకరీల యజమానులు స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తారు. కిలో సెలెక్టెడ్ కేక్ కొనుగోలు చేస్తే అరకి లో ఫ్రీ అని, లేదా కూల్ డ్రింక్ ఫ్రీ అంటూ ఆఫర్లు పెడుతుంటారు. ఈసారి అలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. వినియోగదారుల్లో కరోనా భయం ఇంకా పోలేదని బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు. దానికితోడు కొత్త వేవ్ జనాలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇంట్లోనే కేక్ తయారు చేసుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య ఇంటర్ నెట్ సెర్చింజన్లలో కేక్ మేకింగ్ కు సంబంధించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
స్పెషల్‌గా చేసుకునేవాళ్లం..
ప్రతీ న్యూ ఇయర్ స్నే హితులతో కలిసి స్పె షల్ గా చేసుకునే వా ళ్లం. కానీ చాలా రోజు ల తర్వాత మా ఇంట్లో నే కుటుంబ సభ్యుల మధ్య కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోబోతున్నా. చాలా సంతోషం గా ఉంది.
–సాయితేజ, కాలేజీ విద్యార్థి
ఇంట్లో కేక్ తయారీ..
నాకంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్లే సంతోషంగా ఉన్నా రు. ఎక్కడికి వెళ్లకుం డా ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. మా మమ్మీ, అక్క కేక్ తయారు చేయడం నేర్చుకున్నారు. మా ఇంట్లోనే స్పెషల్ ట్రీట్ ఉంటుంది.
–ప్రశాంత్, విద్యార్థి
బయటకు వెళ్లడం లేదు..
ఈ సారి అందరం కలిసి ఇంట్లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరూ బయటకు వెళ్లమ ని ప్రామిస్ చేశాం. కొత్త సంవత్సరం వేడుకల కోసం స్పెషల్ గా వంటలు నేర్చుకున్నా. కేక్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో చేసిన కేక్ తోనే న్యూ ఇయర్ జరుపుకుంటాం.
–సువర్ణ, గృహిణి