- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్‌లో కరోనా మరో రికార్డు..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కేసుల నమోదులో భారత్ మరో రికార్డును సృష్టించింది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 90,632 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు ఒక్క ఇండియాలో తప్ప మరెక్కడా నమోదు కాలేదని తెలుస్తోంది.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 41,13, 811కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని దేశవాప్తంగా 31,80,865 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా కరోనాతో 1,065 మంది మృతి చెందగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70,626 కరోనా మరణాలు సంభవించాయి.
Next Story