- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐటీ హబ్స్‌కు దూరంగా ఇళ్ల కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి తర్వాత దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదివరకు కొత్తగా ఇళ్లను కొనాలనుకునే వారు తమ ఆఫీసులకు దగ్గరగా ఉండేలా చూసుకునేవారు. అయితే, కరోనా వ్యాప్తి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం సాధారణమైపోవడంతో చాలామంది శివారు ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నోబ్రోకర్ డాట్ కామ్ సేకరించిన వివరాల ప్రకారం.. కొవిడ్-19 కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తప్పనిసరి అయింది.
దేశీయ ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీల్లో శివారు ప్రాంతాల్లో నివాసాలకు డిమాండ్ భారీగా పెరిగిందని తేలింది. మహమ్మారి వ్యాప్తి తర్వాత ఇళ్ల కొనుగోళ్ల ధోరణిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు సేకరించిన వివరాల ప్రకారం.. కార్యాలయాలకు దగ్గరలో కొనుగోళ్లు జరిగేవని, ఇప్పుడు ఆ ధోరణి లేదని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కరోనా వ్యాప్తి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కలిసొచ్చింది.
ప్రస్తుత ఐటీ హబ్ సమీపంలో కంటే ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడిందని కంపెనీ ఓ ప్రకటనలొ తెలిపింది. అంతేకాకుండా, ఐటీ హబ్ కాని ప్రాంతాల్లో ధరలు తక్కువ కావడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడం కూడా దీనికి కారణమని పేర్కొంది. అలాగే, 3,4 బీహెచ్‌కే లాంటి పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టు గమనించామని కంపెనీ వెల్లడించింది. ఉదాహరణకు..హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో 26 శాతం, కొత్తపేటలో 18 శాతం, నాగోల్‌లో 19 శాతం, టోలి చౌకీలో 9 శాతం, రామచంద్రాపురంలో 12 శాతం డిమాండ్ పెరిగిందని కంపెనీ తన నివేదికలో పేర్కొంది.