అంతా ఆన్‌లైన్.. అరచేతిలో ఓటర్ ఐడీ

by Anukaran |   ( Updated:2023-02-14 14:46:35.0  )
అంతా ఆన్‌లైన్.. అరచేతిలో ఓటర్ ఐడీ
X

దిశ, బెల్లంపల్లి : ఓటరు గుర్తింపు కార్డును మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్‌ (ఎలక్ట్రానిక్‌ ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని పేర్కొంది. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ఈ నెల 25 నుంచి 31 వరకు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ ద్వారా ఈ-ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నూతన విధానంపై 'ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఏపిక్'పేరుతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డును మీసేవ కేంద్రాల్లోనే పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి పోర్టల్ ద్వారా http://voterportl.eci.gov.in, NVSP:https://nsvp.in, ఓటర్ హెల్ప్ లైన్, మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ద్వారా

https://play.google.com/store/apps/details?id=com.eci citizen,ఐఓఎస్ ద్వారానైతే http://apps.apple.com/in/app/voter-helpline/id1456535004 వెబ్‌సైట్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed