కరోనా కొత్త పదాలు.. కోవిడియడ్స్, కోవిడియంట్స్

by sudharani |   ( Updated:2020-03-24 05:20:05.0  )
కరోనా కొత్త పదాలు..  కోవిడియడ్స్, కోవిడియంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బయటి ట్రాఫిక్ తగ్గి సోషల్ మీడియాలో ట్రాఫిక్ పెరిగింది. ఈ క్రమంలో రెండు కొత్త పదాలు వాడుకలోకి వచ్చాయి. కోవిడ్ 19 పుణ్యమాని ఇలా కొత్త పదాలు పుడుతున్నాయి. ఇంతకీ ఆ పదాలేంటో, వాటి అర్థమేంటో తెలుసుకుందాం.

కోవిడియట్స్

ఈ పదం పలుకుతుంటేనే సగం విషయం బోధపడుతోంది. ఈ పదాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు. అసలే భయపడకుండా అతి చేసే వాళ్లు, అతిగా భయపడుతూ అతి చేసే వాళ్లను వేలెత్తి చూపడానికి ఈ పదం ఉపయోగించవచ్చు. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఏం పట్టనట్లు వ్యవహరిస్తూ నియమాలు ఉల్లంఘించడానికి ప్రయత్నించేవారిని కోవిడియట్స్‌గా సంబోంధించవచ్చు. అంతేకాకుండా ఈ కోవిడ్ 19 కారణంగా తీవ్ర భయానికి లోనై షాపుల్లో ఉన్న టాయ్‌లెట్ పేపర్లు, నిత్యావసర వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనేవారిని, చిన్న తుమ్ము వచ్చినా కరోనా అనుకుని భయపడేవారిని కూడా కోవిడియట్స్ అనొచ్చు.

కోవిడియంట్స్

కోవిడియట్స్ కానీ వాళ్లందరూ కోవిడియంట్స్ అనొచ్చు. వీరు చక్కగా ప్రభుత్వం చెప్పిన నియమాలు పాటిస్తూ, ఇంట్లోనే ఉండి ఈ క్వారంటైన్ సమయాన్ని కొత్త విషయం నేర్చుకోవడానికో, కుటుంబంతో ఆనందంతో గడపడానికో కేటాయించేవారన్నమాట. అలాగే అతిగా భయపడకుండా మూఢనమ్మకాలకు, సొంత వైద్యాలకు పోకుండా ఒక పద్ధతిగా సంక్షోభ సమయాన్ని ఉత్పాదక సమయంగా మలుచుకుంటున్నవాళ్లందరూ కోవిడియంట్స్ కేటగిరీ కిందకి వస్తారు.

ఇది చదివాక ఇప్పుడు లాక్ డౌన్ నియమాలు పట్టించుకోకుండా బయటికి వచ్చి, పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న వారిని ఏమని పిలవాలో అర్థమైందో కదా?

Tags: COVID, COVID 19, Corona, Covidien, Cov Idiots, New terms

Advertisement

Next Story

Most Viewed