ఎంజీఆర్ పాత్రలో జీవించడం బాధ్యత: అరవింద స్వామి

by Shyam |
ఎంజీఆర్ పాత్రలో జీవించడం బాధ్యత: అరవింద స్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుండగా..తన లైఫ్‌లో కీలకపాత్ర పోషించిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వర్ధంతిని పరస్కరించుకుని అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.

ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో నటించిన అరవింద స్వామి స్టిల్స్ రిలీజ్ చేసింది. ట్విట్టర్‌లో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసిన అరవింద స్వామి..పురట్చి తలైవర్ ఎంజీఆర్ పాత్ర చేయడం గౌరవం మాత్రమే కాదు..బాధ్యత కూడా అని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్, నిర్మాతలు విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తలైవి జయలలిత జీవితంలో ఎంజీఆర్ పాత్ర చాలా కీలకం.

Advertisement

Next Story

Most Viewed