- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్‌లో దొరికిన కొత్త జీవి.. పేరు కూడా అదే!
దిశ, వెబ్‌డెస్క్: ఎంతోకాలం అడవుల్లో ప్రతి అంగుళాన్ని గమనిస్తూ తిరుగుతూ తర్వాత శాంపిల్స్‌ను రోజుల తరబడి పరిశోధనాశాలల్లో పరీక్షిస్తే కొత్త జీవి జాడ తెలుస్తుంది. కానీ ట్విట్టర్‌లో ట్వీట్లు చూస్తూ కూడా కొత్త జీవిని కనిపెట్టింది డెన్మార్క్‌కు చెందిన ఓ బయోలజిస్ట్. దీనికి ట్విట్టర్ పేరుమీదుగానే ‘ట్రోగ్లోమైసెస్ ట్విట్టెరీ’ అని పేరు పెట్టడం విశేషం.
యూనివర్సిటీ ఆఫ్ కొపెన్‌హెగెన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ ఆఫ్ డెన్మార్క్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆనా సోఫియా రెబోలైరా ట్విట్టర్ బ్రౌజ్ చేస్తుండగా ఉత్తర అమెరికాకు చెందిన ఒక మిల్లీపిడ్ (గుర్రం పురుగు లాంటిది) కనిపించింది. 2018లో డెరెక్క హెన్నెన్ అనే ఎంటమాలజిస్ట్ దీని ఫొటోను పోస్ట్ చేశారు. అప్పటి అమెరికా మిడ్‌టర్మ్ పోల్స్ సమయంలో పోస్ట్ చేసిన ట్వీట్ అది.
ఆ మిల్లీపిడ్ ఫొటోలో రెబోలైరాకు దాని మీద ఉన్న చిన్న చుక్కలు కనిపించాయి. అది ఒక ఫంగై అయి ఉంటుందని, గతంలో మిల్లీపిడ్‌ల మీద ఇలాంటి ఫంగై కనిపించలేదని ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ ఫోటోను తన సహోద్యోగి హెన్రిక్‌కి చూపించింది. ఇద్దరు కలిసి ఆ ఫంగై ఏ జాతికి చెందిందో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మ్యూజియంలో ఉన్న పుస్తకాలన్నీ తిరగేశారు, కానీ, జాడ దొరకలేదు. తర్వాత ఇలాంటి ఫంగై అమెరికాలోని మిగతా మిల్లీపిడ్‌ల మీద ఉండటం గమనించారు. కానీ, దీని గురించి ఎందులోనూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు దీన్ని కొత్త జీవిగా గుర్తించారు.
ఈ ట్రోగ్లోమైసెస్ ట్విట్టెరీ జీవి లబౌల్బేనియాలెస్ క్రమానికి చెందినది. ఈ చిన్న ఫంగల్ పారాసైట్ కీటకాలు, మిల్లీపిడ్‌ల మీద దాడి చేస్తాయి. వాటి శరీరం మీదనే జీవిస్తూ వాటికి హాని కలిగిస్తాయి.