ట్విట్టర్‌కు కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఫస్ట్ వార్నింగ్

by Shamantha N |   ( Updated:2021-07-08 10:46:43.0  )
minister ashwin vaishnav
X

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో నివసిస్తున్నవారు, పనిచేసుకుంటున్నవారంతా ఈ దేశ చట్టాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ట్విట్టర్‌ కూడా లా ఆఫ్ ల్యాండ్ పాటించాలని సూచించారు. మూడు నెలలకు క్రితం రూపొందించిన నూతన డిజిటల్ చట్టాలను సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాల్సి ఉంది. కానీ, ట్విట్టర్ వీటిని అమలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య పొసగడం లేదు. ఈ తరుణంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ స్థానంలో అశోక్ చౌబే బుధవారం ప్రమాణం చేశారు. గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శి బీఎస్ సంతోష్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌లో ఉన్నప్పుడు ఇక్కడి చట్టాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed