ఓటీపీ ఉంటేనే నగదు విత్‌డ్రా :పీఎన్‌బీ

by Harish |
ఓటీపీ ఉంటేనే నగదు విత్‌డ్రా :పీఎన్‌బీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇదివరకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తరహాలో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఓటీపీ నంబర్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం వెల్లడిచింది. పీఎన్‌బీ ఏటీఎంల నుంచి రూ. 10 వేలకు మించి నగదును విత్‌డ్రా చేసేందుకు ఖాతాదారులు రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు, ఇకమీదట పీఎన్‌బీ ఖాతాదారులు సురక్షితంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. బ్యాంకు నిబంధన ప్రకారం..డిసెంబర్ 1 నుంచి ఖాతాదారులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రూ. 10 వేల కంటే ఎక్కువ నగదును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విటర్ ద్వారా బ్యాంకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాగా, ఇదివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంల నుంచి రూ. 10 వేల కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేసేందుకు ఓటీపీ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ నిబంధన జనవరిలోనే అమలు చేసినప్పటికీ, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు దీన్ని అమలు చేసింది. అనంతరం సెప్టెంబర్ నుంచి 24/ 7 ఈ నిబంధనను అమలు పరిచింది.

Advertisement

Next Story