త్వరలో ఏపీపీఎస్సీలో ప్రక్షాళన

by srinivas |
త్వరలో ఏపీపీఎస్సీలో ప్రక్షాళన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీపీఎస్పీలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ఏపీపీఎస్పీ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఇకపై ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ట్యాబ్స్ ద్వారానే పోటీ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ మార్పులు తీసుకురావాలని ఎపీపీఎస్పీ యోచిస్తోంది. ప్రశ్నపత్రాల రూపకల్పనను జాతీయ, అంతర్జాతీయ నిపుణులకు అప్పగించనుంది. ప్రశ్నపత్రాలు రూపొందించే వారికి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అభ్యర్థుల టాబ్స్‌కు నేరుగా ఆన్ లైన్ ద్వారా ప్రశ్నపత్రాలు చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Advertisement

Next Story