- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరికొత్త 'సెలెరియో' మోడల్.. ప్రీ-బుకింగ్ స్టార్ట్ చేసిన మారుతీ సుజుకి!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) తన సరికొత్త హ్యాచ్‌బ్యాక్ ‘సెలెరియో’ కారు కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది. దీనికోసం రూ.11,000 మొత్తాన్ని చెల్లించి ఈ కొత్త వెర్షన్ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘దేశీయ మార్కెట్లో ‘సెలెరియో’ మోడల్ తన మెరుగైన ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ ద్వారా వినియోగదారుల నుంచి ఆదరణను సంపాదించింది. కొత్తగా రాబోయే వెర్షన్ మరింత అత్యాధునిక టెక్నాలజీతో పాటు మరింత ఆకట్టుకునే డిజైన్‌లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోందని’ ఎంఎస్ఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ‘సెలెరియో’ పెట్రోల్ ఇంజిన్, కాంపాక్ట్ విభాగంలో మెరుగైన ఫీచర్లతో లభిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్‌తో కూడిన ఈ వాహనం ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, గణనీయమైన ఇంధన సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారుగా నిలుస్తుందని ఎంఎస్ఐ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ అన్నారు.