మూసాపేట రోడ్డుపై నవజాత శిశువు..!

by Shyam |
మూసాపేట రోడ్డుపై నవజాత శిశువు..!
X

దిశ, వెబ్‎డెస్క్ : హైద‌రాబాద్‎లోని మూసాపేట‌లో దారుణం చోటు చేసుకుంది. జనతానగర్‎లో అప్పుడే పుట్టిన ఓ శిశువును న‌డిరోడ్డుపై వ‌దిలేసి వెళ్లిపోయారు గుర్తు తెలియన వ్యక్తులు. బాలుడి ఏడుపు విన్న స్థానిక మ‌హిళ అప్ర‌మత్త‌మై.. శిశువును చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. అనంతరం పసికందును కూకట్‌ప‌ల్లి పోలీసుల‌కు అప్ప‌గించింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్టర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

Next Story