- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంగానదిలో దొరికిన గంగమ్మ
దిశ,వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఘాట్ వద్ద గంగానదిలో పడవనడిపే వ్యక్తికి ఓ పసిపాప ఏడుపులు వినిపించాయి. దీంతో అతను చుట్టుపక్కలా వెతికాడు అయినా ఎవరూ కనిపించలేదు..దాంతో నదిలో చూసేసరికి ఓ చెక్కపెట్టె కొట్టకుంటూ వస్తుంది. అందులో పాప ఉందని అనుమానంతో ఆ పెట్టను తీసుకుని గంగానదీ ఒడ్డుకు వెళ్లాడు అందులో ఉన్న పసిపాపను చూసి ఆశ్చర్యానికి గురైన ఆయన గట్టిగా అరిచాడు. దీంతో అతని అరుపులు విన్న స్థానికులు అట్టపెట్టెలో ఉన్న పసిపాపను చూసి షాక్ అయ్యారు.
అయితే ఆ పెట్టెలో రెడ్ కలర్ క్లాత్‌లో పసిపాపను పెట్టి ఆమె పక్కకు ఓ పేపర్ పెట్టి పంపించారు. అందులో ఆ చిన్నారి జాతకచక్రం ఉంది. ఆమె జాతక చక్రం ప్రకారం చిన్నారికి గంగా అని పేరు పెట్టునట్టిగా పేపర్‌లో తెలిపారు. వీటితో పాటు కనకదుర్గ అమ్మవారి ఫొటో కూడా పెట్టెలో ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురైనారు. దీంతో గంగమ్మే పాపరూపంలో మా దగ్గరికి వచ్చిందని పాపను తానే పెంచుకుంటానని పడవ నడిపే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. కానీ దానికి పోలీసులు ఒప్పుకోకుండా పసిపాపను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు.