కేటీఆర్‌పై నెటిజన్ల ఫైర్.. కేవలం బాటిల్స్ మార్చడానికే సమీక్షలా..?

by Shyam |
KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరం కూసింత వర్షానికే జలసంద్రమవుతోంది. శనివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గత నెల కూడా భారీ వర్షాలు కురవడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించారు. అంతేకాకుండా సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు హైదరాబాద్ వరదల్లో చిక్కుకోగా మంత్రి సమీక్ష నిర్వహించి నాలాల క్రమబద్ధీకరణ పై అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో రెండు సమావేశాలను ఉద్దేశించి సామాజిక వేత్త విజయ్ గోపాల్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఆయన చేసిన ట్వీట్ “From 2016 to 2021 reviews, only improvement we see is that they chose to replace plastic water bottles and moved to Copper (Raagi) flasks. Our lives had nothing changed in it. No laws to criminalize encroachments, no penalties on people littering, NOTHING. Development I suppose” అని రెండు ఫొటోలను పోస్ట్ చేశారు.

అంటే 2016 నుంచి 2021 వరకూ సమీక్షలు, చర్చలు జరుపుతున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మన బతుకులు మారలేదు. కబ్జాదారులను శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు రాలేదు. కేవలం సమీక్షలో ప్లాస్టిక్ బాటిల్ నుంచి రాగి బాటిల్స్ ను మార్చారు అంతే అని విజయ్ గోపాల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ కేటీఆర్ సమీక్షలకే పరిమితమంటూ మండిపడుతున్నారు.

Advertisement

Next Story