ఇన్నర్ పార్ట్స్‌కు మెరుపునిచ్చే యాడ్‌పై విమర్శలు

by Shyam |
beauty-products,
X

దిశ, ఫీచర్స్ : అతివలు అందానికిచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇప్పుడు పురుషుల కోసం కూడా సెపరేట్‌గా అనేక రకాల కాస్మొటిక్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. తమ చర్మ సౌందర్యంపై కస్టమర్ల ఆత్మన్యూనతే ఈ కంపెనీల పెట్టుబడి కాగా.. కేశాలకు, ముఖ అరవిందానికి అందాన్నిచ్చే ఉత్పత్తుల నుంచి మొదలుపెడితే ప్రైవేట్‌ పార్ట్స్‌లో చర్మ సంరక్షణకు హెల్ప్ చేసే సీరమ్స్ వరకు అనేక రకాల ప్రొడక్ట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే కార్పొరేట్ ఉత్పత్తుల పనితీరుపై కొంతకాలంగా నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుండగా.. వీటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై జనాలు కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్.. తన ఉత్పత్తిని రీబ్రాండ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ చర్యల్లో భాగంగా ప్రైవేట్ పార్ట్స్‌ బ్రైటెనింగ్ కోసం రూపొందించిన యాడ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తొడల మధ్య ఏర్పడే మచ్చలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని పెంచేందుకు ‘ఇంటిమేట్ లైటెనింగ్ సీరం’ ఉపయోగపడుతుందంటూ సదరు కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటోంది. అయితే స్కిన్ లైటెనింగ్ కోసం ఉద్దేశించబడిన ఈ యాడ్ కాన్సెప్ట్ విషయంలోనే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడల్ రెండు తొడల మధ్య బొప్పాయి ముక్కతో పాటు నిలువుగా తమ ప్రొడక్ట్‌ను డిస్‌ప్లే చేయడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై స్పందించిన శ్రీమి వర్మ అనే ట్విట్టర్ యూజర్.. ‘ఈ యాడ్ ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పేందుకు నాకు శక్తి చాలడం లేదు. కానీ ప్రమోషన్ కోసం వారు ఎంచుకున్న ప్రదేశాన్ని చూశాక చెప్పక తప్పడం లేదు’ అన్నారు. మోడల్‌ను అలా చూపించడాన్ని తప్పుబట్టిన ఆమె.. మామూలుగా ఇన్నర్ థైస్ అని చెప్తే అందరికీ అర్థమవుతుందని, అంతేకాని సింబాలిక్‌గా అమ్మాయి తొడల మధ్య సదరు క్రీమ్‌ను చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

ఇక మరొక ట్విట్టర్ యూజర్.. ‘ఇప్పటికే ఎన్నో బ్రాండ్లు జననేంద్రియాల కోసం బ్రైటెనింగ్ లోషన్స్ విక్రయిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలన్నీ ఇన్నర్ పార్ట్స్‌ చుట్టూ మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం సాధారణమనే విషయంపై అవగాహన కల్పించకుండా, దీన్ని క్యాష్ చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది మహిళలు మంచి ఫలితాల కోసం ఇలాంటి ప్రొడక్ట్స్ వాడి మోసపోతున్నారు’ అని పోస్టు చేసింది.

Advertisement

Next Story

Most Viewed