ఇజ్రాయెల్ దాడుల్లో హీరోయిన్‌కు గాయాలు.. పిక్ వైరల్

by vinod kumar |
Netflix Star Maisa Elhadi
X

దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ స్టార్ మైసా అబ్దుల్ ఎల్ హాది ఇజ్రాయిల్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో గాయపడింది. హైఫాలో శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న తమపై(పాలస్తీనా కుటుంబాలు) దాడులు జరిగాయంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. పాటలు పాడడం ద్వారా తమ నిరసనను తెలిపామన్న ఆమె.. తాను ఆ దృశ్యాలను చిత్రీకరించడంలో మునిగిపోయానని.. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఇజ్రాయెల్ ఫోర్సెస్ గ్రెనేడ్ దాడులు చేయడం మొదలుపెట్టింది.

దీంతో సేఫ్‌గా అనుకున్న ఓ ప్రదేశంలో నిలబడి.. కాసేపటి తర్వాత తన కారుకు దగ్గరగా వెళ్తున్న క్రమంలో పెద్ద శబ్ధం వినిపించింది. ఆ తర్వాత తన కాలు చర్మం ఊడిపోయి రక్తం వస్తుందని తెలుసుకునేందుకు కొంత సమయం పట్టిందనీ చెప్పింది. తన పక్కనే ఉన్న ఓ వ్యక్తి తనకు సపోర్ట్ చేశాడని.. తమ దగ్గరికి అంబులెన్స్ చేరుకునేందుకు అరగంట సమయం పట్టిందని తెలిపింది. ఇక్కడ అదృష్టకరమైన విషయమేంటంటే మరణం మా దరికి చేరకపోవడమే. ‘మైసా’

Advertisement

Next Story