గ్రామీణ మార్కెట్లకు విస్తరించడమే లక్ష్యం : నెస్లె ఇండియా!

by Harish |
గ్రామీణ మార్కెట్లకు విస్తరించడమే లక్ష్యం : నెస్లె ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామీణ మార్కెట్‌పై దృష్టి సారించి, మరో రెండేళ్లలో సుమారు 1.2 లక్షల గ్రామాలకు చేరుకోవాలని భావిస్తున్నట్టు ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లె ఇండియా తెలిపింది. దీనికోసం పంపిణీ విస్తరణతో పాటు కొత్త పోర్ట్‌ఫోలియోలో కొన్ని ఉత్పత్తులను పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు నెస్లె ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష నారాయణన్ చెప్పారు. అలాగే, ప్రకటనల విధానంలో పలు మార్పులను తీసుకుని రావడం ద్వారా గ్రామీణ మార్కెట్‌లో పట్టు సాధించాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అదేవిధంగా, కరోనా మహమ్మారిని అధిగమిస్తూ పట్టణ మార్కెట్లలో పుంజుకునేందుకు డైరెక్ట్-టూ-కంజ్యూమర్ ద్వారా వినియోగదారులకు ఇంటి వద్దకే ఉత్పత్తులను అందించాలని ప్రయత్నిస్తోంది. ‘1,20,000 గ్రామాలను చేరుకోవడమే తమ లక్ష్యం. 5 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలను రాబోయే రెండు, మూడేళ్లలో చేరుకోవాలనుకుంటున్నట్టు సురేష్ తెలిపారు. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో విడుదల చేయబోయే ఉత్పత్తులను పునరుద్ధరించడం, ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పట్టణ మార్కెట్ పునరుజ్జీవనానికి చాలా కీలకం. అయితే, కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున వృద్ధి ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది చెప్పడం కష్టమని ఆయన వివరించారు.

Advertisement

Next Story