- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాచారంలో నేపాలి దొంగలు.. వీడిన ముఠా గుట్టు
దిశ, క్రైమ్ బ్యూరో : నాచారం పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను మల్కాజిగిరి సీసీఎస్, నాచారం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ నెల 23 మంగళవారం రాత్రి 7గంటల సమయంలో మల్లాపూర్ బంగారం దుకాణం వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నాచారం పీఎస్ పరిధిలో 4 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
అంతేకాకుండా, మరో నలుగురు తమ ముఠా సభ్యులు ఉన్నట్టు చెప్పడంతో మహిళతో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి సుమారు రూ.13.20 లక్షల విలువైన 21తులాల బంగారం, 50 తులాల వెండి, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ టీవీ, ఇతర ఆభరణాలు, ఐఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నాచారం పోలీస్‌స్టేషన్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్, డీఐ మల్లారెడ్డిలను ఏసీపీ అభినందించారు.