- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశ్వాసం’ కోల్పోయిన కె.పి ఓలి
ఖాట్మాండు: నేపాల్ ప్రధాని కె.పి ఓలి అక్కడి పార్లమెంట్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో పరాజితులయ్యారు. ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి ఆదేశాల మేరకు నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఈ పరీక్షలో ఓలికి అనుకూలంగా కనీసం 136 ఓట్లు కావాల్సి ఉండగా, 93 మాత్రమే వచ్చాయి. 124 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. నేపాల్ పార్లమెంటులో 271 స్థానాలు ఉండగా, 232 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో 217 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 15 మంది సభ్యులు న్యూట్రల్‌గా ఉన్నారు. మెజార్టీ ఓట్లు రాకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రధాని ఓలి వీగిపోయారు.
నేపాల్‌లో ప్రభుత్వం కూలిపోయింది. ఓటమి నేపథ్యంలో ఓలి తన రాజీనామాను రాష్ట్రపతి బిద్యాదేవికి సమర్పించనున్నారు. రాజీనామా ఆమోదం అనంతరం రాష్ట్రపతి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పార్లమెంటును ఆదేశిస్తారు. కాగా, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ)లో ప్రధాని కె.పి శర్మ ఓలీకి, మాజీ ప్రధాని ప్రచండ వర్గాల మధ్య కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఓలి ప్రకటించడంతో ఇవి తారాస్థాయికి చేరాయి. దీంతో ఓలిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రచండ నేతృత్వంలోని చీలిక వర్గం ప్రకటించింది. ఈ క్రమంలోనే అధికార ఎన్సీపీ సైతం ఓలికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ పరిణామాలు విశ్వాస పరీక్షకు దారితీశాయి.