భారత యువకున్ని కాల్చి చంపిన నేపాల్ పోలీసులు

by Sumithra |
భారత యువకున్ని కాల్చి చంపిన నేపాల్ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండో నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారత పౌరుడు మరణించాడు. వివరాల ప్రకారం.. గోవిందా అనే 26 ఏళ్ల యువకుడు కొన్ని రోజుల క్రితం తన మిత్రులు పప్పూ యాదవ్, గుర్మిత్ సింగ్‌లతో కలిసి నేపాల్ వెళ్లాడు. అయితే నేపాల్ పోలీసులతో భారత యువకుడికి కొంత వాగ్వాదం జరిగింది. దీంతో నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోవిందా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన గోవిందాను ఆసుపత్రికి తరలించే సమయంలోనే అతను మరణించారని ఫిలిభిత్ జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు. గోవిందాతో నేపాల్ వెళ్లిన ఒకరు తప్పించుకొని భారత్ సరిహద్దుకు రాగా మరో వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడు. నేపాల్ పోలీసుల జరిపిన కాల్పులతో ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story