ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వర్క్ చేయగలరు.. నేను చేశా.. : నేహా ధూపియా

by Shyam |
ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వర్క్ చేయగలరు.. నేను చేశా.. : నేహా ధూపియా
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి నేహా ధూపియా ప్రెగ్నెంట్ వుమెన్‌కు అవకాశాలు పెరగాలని అభిప్రాయపడింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ మహిళలు వర్క్ చేయగలరని, ఆ కెపాసిటీ వారికి ఉంటుందని తెలిపింది. తను గర్భవతిగా ఉన్న సమయంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా, అన్ని ప్రికాషన్స్ తీసుకుని, ఎంత కఠినంగా అనిపించినా పని పూర్తి చేశానని తెలిపింది. తను చేయగలిగినప్పుడు ఇతరులు కూడా చేయగలరని నిరూపించేందుకు కరోనా సమయంలో పని చేశానని చెప్పింది. గర్భిణీలు కూడా వ్యక్తిగత, వృత్తిపరమైన పనులు సమర్థవంతంగా చూసుకోగలరు అని ధీమా వ్యక్తం చేసింది. తను రెండు బ్యాలెన్స్ చేస్తానో లేదో తెలియదు కానీ అలా చేస్తే మాత్రం బిజినెస్‌పై ఎఫెక్ట్ పడుతుందన్నారు. ఏదేమైనా గర్భిణీ మహిళలకు ఆ సమయంలోనూ మంచి పాత్రలు రావాలని కోరుకున్నారు. వృత్తిపరంగా వారిని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Next Story

Most Viewed