- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంజీఎం చుట్టూ వాడేసిన పీపీఈ కిట్లు
దిశ ప్రతినిధి, వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు తాండవిస్తున్నాయి. కరోనా రోగులకు సమయానికి అన్నం పెట్టాల్సిన వైద్యాధికారులు, కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తప్పుడు లెక్కలతో బిల్లులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కరోనా బాధితులకు నాణ్యత గల ఆహారంతో పాటు ఫ్రూట్స్ అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రిలో పీపీఈ కిట్లు, అన్నం తిన్న ప్లేట్లు ఇష్టారాజ్యంగా పడేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మంత్రులు చెప్పినా సమస్యలు అలాగే ఉన్నాయని రోగులు చెప్తున్నారు.
ఉత్తర తెలంగాణ ప్రజలకు ధర్మాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంగనర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్‌ఘడ్, మహారాష్ర్ట నుంచి ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. కాగా, కరోనా చికిత్స కోసం ఎంజీఎంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఆ వార్డులో ప్రస్తుతం 200 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. రోగులకు మెరుగైన వసతులు అందించడం కోసం చర్యలు చేపడుతామని మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు, ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన మంత్రుల బృందం కరోనా వార్డు రూపురేఖలు మార్చుతామని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. సిబ్బంది పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఎంజీఎం పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
బాధితుల ఆవేదన..
కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా అన్నం, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అందించాలని ప్రభుత్వం కొన్ని నిబంధనలు పొందుపర్చింది. ఒక్కో రోగికి రూ. 200లు ఇవ్వాలని నిర్ణయించింది. నిబంధనల మేర ఉదయం 8 గంటలకు అల్పాహారం, పాలతో పాటుగా లీటర్ వాటర్ బాటిల్ అందించాలి. మధ్యాహ్నం అన్నంతో పాటుగా రెండు గోధుమ రొట్టెలు, 150 గ్రాముల కర్రీ, 150 గ్రాముల సాంబార్, ఒక ఉడికించిన గుడ్డు, ఒక అరటి పండు ఇవ్వాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్, వైద్యాధికారులు కుమ్ముక్కై నిబంధనలు తుంగలో తొక్కి రోగులకు నాణ్యత లేని ఆహారం అందించి అందిన కాడికి దండుకుంటున్నారని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఆరుబయట వాడేసిన పీపీఈ కిట్లు
ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు, ఫేస్ మాస్క్, గ్లౌజులను ఆస్పత్రి ఆరు బయట విచ్చల విడిగా పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిన్న ప్లేట్లను తీసేయకపోవడంతో చెత్త పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగించిన పీపీఈ కిట్లు, చెత్తాచెదారం బయట పడేయకుండా చర్యలు చేపట్టాలని రోగుల తరఫు బంధువులు వేడుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం: డాక్టర్ నాగార్జున రెడ్డి, సూపరింటెండెంట్, ఎంజీఎం
కరోనా రోగులకు నాణ్యత కలిగిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందుకు 8 మంది డాక్టర్లతో కమిటీ వేశాం. ఎవరికైనా అన్నంతో పాటుగా ఫ్రూట్స్ అందలేదని రోగులు తెలిపితే చర్యలు తీసుకుంటాం. వాడిన పీపీఈ కిట్లు, ప్లేట్లు పడేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.