టీకా వేసుకుంటే నెగెటివ్ రిపోర్ట్ అనవసరం?

by Shamantha N |
టీకా వేసుకుంటే నెగెటివ్ రిపోర్ట్ అనవసరం?
X

న్యూఢిల్లీ: కరోనా టీకా రెండు డోసులూ తీసుకున్నవారికీ దేశీయంగా విమాన ప్రయాణాలను మరింత సరళం చేయడానికి కేంద్రప్రభుత్వం యోచిస్తు్న్నది. ఒకవైపు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి నిబంధనతో ల్యాబ్‌లపై భారాన్ని తొలగించడంతోపాటు ప్రయాణికులకూ స్వేచ్ఛ ఇచ్చే నిర్ణయంపై కసరత్తు చేస్తున్నది. రెండు డోసులూ తీసుకున్నవారు దేశీయంగా విమాన ప్రయాణం చేయడానికి ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పకుండా సమర్పించాలన్న నిబంధనను తొలగించే యోచన చేస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురి పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉన్నదని వివరించారు. ఈ నిర్ణయాన్ని కేవలం పౌరవిమానయాన శాఖ స్వయంగా తీసుకోలేదని, నోడల్ ఏజెన్సీ ఆరోగ్య శాఖ నిపుణుల అభిప్రాయాలు ఈ నిర్ణయం కోసం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story