రణ్‌బీర్‌తో బ్రేకప్.. హీరోయిన్స్‌నే బ్లేమ్ చేసిన తల్లి

by Shyam |
Neetu Kapoor Blames Ranbir Kapoor Love Intrests
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ మంచి ఫ్లర్టర్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవంతికా మాలిక్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, ఇప్పుడు ఆలియా భట్. ఇంత మందితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసిన రణ్‌బీర్.. ముగ్గురికి మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసి, ఆలియాతో పెళ్లి అని కబుర్లు చెప్తున్నాడు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియదు కానీ.. తన వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిన అమ్మాయిలు మాత్రం కమిట్‌మెంట్స్‌కు భయపడే బ్రేక్ చెప్తాడని ఓపెన్‌గా చెప్పేశారు. కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే అమ్మాయిలు కావాలి తప్పితే.. కమిట్‌మెంట్స్‌కు వచ్చేసరికి వెనకాడుతాడని తెలిపారు. అయితే వీరితో రిలేషన్‌‌షిప్ బ్రేకప్‌ కావడంలో తన కొడుకు తప్పేమీ లేదని రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ చెబుతోంది. ఇండైరెక్ట్‌గా తనయుడి వల్ల సఫర్ అయిన గర్ల్స్‌నే బ్లేమ్ చేసింది ఈ మహాతల్లి.

తాజా ఇంటర్వ్యూలో కొడుకు గురించి మాట్లాడిన నీతు.. రణ్‌బీర్‌తో డేటింగ్ చేసిన గర్ల్స్ ఎవరు కూడా తనకు సూట్ కారని అభిప్రాయపడింది. తను చాలా సాఫ్ట్, ఎవరినీ హర్ట్ చేయలేడన్న ఆమె.. తను రిలేషన్‌షిప్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని, నో చెప్పడం కూడా తెలియని అమాయకుడని చెప్పింది. ఇదంతా గమనించినా ఏమీ చేయలేకపోయానని వివరించింది. ఫస్ట్ టైమ్ రణ్‌‌బీర్ డేటింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ గర్ల్ తనతో సరిగ్గా లేదని గమనించానని, ఆ విషయాన్ని చెప్తే వ్యతిరేకించాడని తెలిపింది. దీంతో ఈ మ్యాటర్‌ను మరో రకంగా డీల్ చేస్తేనే బాగుంటుంది అనుకుని గర్ల్స్ విషయంలో అంత సీరియస్‌నెస్ పనికిరాదని సలహా ఇచ్చానని.. నచ్చిన అమ్మాయితో బయటకు వెళ్లాలని, నచ్చితేనే ఓకే చెప్పమని తనకు సూచించానని నీతు వెల్లడించింది.

Advertisement

Next Story