బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన 'గోల్డెన్' బాయ్ నీరజ్.. ఏమన్నాడంటే..?

by Anukaran |   ( Updated:2021-08-10 05:44:11.0  )
బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన గోల్డెన్ బాయ్ నీరజ్.. ఏమన్నాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించి గోల్డెన్ బాయ్ గా మారిపోయాడు నీరజ్ చోప్రా. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ ‘బంగారు’ బాబు ముచ్చట్లే. ఇక గోల్డ్ సాధించిన దగ్గర నుంచి నీరజ్ చోప్రా బయోపిక్ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాలీవుడ్ లో నీరజ్ బయోపిక్ మొదలు కానున్నదని, ఆ చిత్రం కోసం హీరోలు ఎవరు అవసరం లేదు.. నీరజ్ హీరోలా ఉంటాడు కాబట్టి అతనినే తీసుకొంటారేమో అంటూ రూమర్స్ గుప్పుమన్నాయి.

ఇక ఈ రూమర్స్ పై తాజాగా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్పందించాడు. ఇప్పట్లో తన బయోపిక్ కి తాను రెడీగా లేనని తేల్చి చెప్పేశాడు. ” భారతదేశ క్రీడారంగంలో నూతన విప్లవానికి ఇది మొదటి అధ్యాయమని, త్వరలోనే మరెన్నో అద్భుతాలు చూస్తారు. ఇక నా బయోపిక్ కి ఇంకా చాలా టైం ఉంది. నేను సాధించాల్సింది ఇంకా ఎక్కువగానే ఉంది. రిటైర్మెంట్ వరకు బయోపిక్ గురించి ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కామన్ వెల్త్.. ఆసియా.. వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పైనే” అని చెప్పుకొచ్చారు. ఇక నీరజ్ వ్యాఖ్యలతో అతని బయోపిక్ వస్తుంది అనుకున్నవారికి షాక్ తగిలినట్లే. ఇక ఇటీవలే స్వదేశానికి చేరుకున్న నీరజ్ కి భారీ ఎత్తున స్వాగతం లభించింది.

Advertisement

Next Story

Most Viewed