- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేరళలో ప్రతిపక్ష కూటమిలోకి ఎన్‌సీపీ నేతలు
తిరువనంతపురం: కేరళలో అధికార కూటమి ఎల్‌డీఎఫ్‌లో భాగంగానున్న ఎన్‌సీపీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్‌లోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం ప్రతిపక్షాలకు కలిసి రానుంది. ఏడు జిల్లాల ఎన్‌సీపీ అధ్యక్షులు, రాష్ట్ర క్యాడర్‌లోని తొమ్మిది మంది నేతల మద్దతు ఉన్నట్టు ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌లో చేరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొంటానని వివరించారు. కాంగ్రెస్ నేత కేఎం మణి 50 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన పాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్‌డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు.
కేఎం మణి మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రానున్న ఎన్నికల్లో పాల స్థానంలో టికెట్‌ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఐ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ నిర్ణయించడంతో ఎన్‌సీపీ ఎమ్మెల్యే మణి సీ కప్పన్ రెబల్ అయ్యారు. ఈ పరిణామంపై ఎన్‌సీపీ జాతీయ నేతలు స్పందించలేదు. ఎల్‌డీఎఫ్ టికెట్ పై గెలిచి యూడీఎఫ్‌లో చేరితే ప్రజలను మోసం చేసినట్టవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్ హెచ్చరించారు. ఎల్‌డీఎఫ్ కూటమిలోనే ఎన్‌సీపీ కొనసాగుతున్నదని, మణి సీ కప్పన్ వెళ్లినంత మాత్రానా అధికారపక్షానికి నష్టమేమీ లేదని వివరించారు. పాల స్థానాన్ని ఎల్‌డీఎఫ్ మళ్లీ గెలుచుకుంటుందని విశ్వాసాన్ని ప్రకటించారు