మోడీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ.. ఫోటో వైరల్

by Shamantha N |   ( Updated:2021-07-17 07:50:42.0  )
modi news
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్‌పవార్ శనివారం భేటీ అయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నివాసంలో వీరి మద్య భేటీ సుమారు 50 నిమిషాల పాటు జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.

ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారంటూ వారిద్దరి భేటీకి సంబంధించిన ఓ ఫోటోను ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా భేటీ అనంతరం పవార్ కూడా ఓ ట్వీట్ చేశారు. “ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నాను. దేశ ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించాను” అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, భేటీలో ప్రధానంగా మంత్రి వర్గంలో నూతనంగా ఏర్పాటైన సహకార మంత్రిత్వ శాఖపై పవార్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు రైతుల సమస్యల గురించి చర్చకు వచ్చినట్టు సమాచారం.

Advertisement

Next Story