నవరసాల మిళితంగా ‘నవరస’ టీజర్

by Shyam |   ( Updated:2021-07-09 01:54:23.0  )
నవరసాల మిళితంగా ‘నవరస’ టీజర్
X

దిశ, సినిమా : తమిళ్ ఆంథాలజీ ‘నవరస’ రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన టీజర్ ప్రశంసలు అందుకుంటోంది. తొమ్మిది కథల సంకలనంతో వస్తున్న ఆంథాలజీ టీజర్‌లో నవరసాలను ప్రజెంట్ చేసిన మేకర్స్.. ఆగస్టు 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతం’ ఇలా నవరసాలు బేస్ చేసుకుని తెరకెక్కిన ‘నవరస’ ఆంథాలజీని మణిరత్నం, జయేంద్ర నిర్మించగా.. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తొమ్మిది మంది ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఒక్కో ఎమోషన్‌ను ఒక్కో స్టోరీగా మలిచారు.

అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజు, కార్తీక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రమ్, రతీంద్రన్ ప్రసాద్, హలితా షమీమ్ ఈ ఆంథాలజీకి దర్శకత్వం వహించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన 40 మంది ప్రముఖ నటులు, 100కు పైగా క్రియేటివ్ – ఫిల్మ్ టెక్నీషియన్స్ ఇందుకోసం ఫ్రీగా వర్క్ చేశారు. ఈ ఆంథాలజీ ద్వారా వచ్చిన డబ్బును పాండమిక్‌లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న సినీకార్మికుల కోసం వినియోగించనుండగా.. కోలీవుడ్ క్రియేటివ్ కమ్యూనిటీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తానికి తమిళ్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇది ప్రౌడ్ మూమెంట్ కాగా.. ఈ ప్రాజెక్ట్‌కు లైఫ్ ఇచ్చేందుకు వర్క్ చేసిన యాక్టర్స్‌కు నెటిజన్లు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed