నాచురల్ స్టార్ షూటింగ్ షురూ

by Anukaran |   ( Updated:2020-10-06 01:52:24.0  )
నాచురల్ స్టార్ షూటింగ్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విస్తృత వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ మూలంగా సినిమా షూటింగ్‌లు నిలిపివేసిన సంగతీ తెలిసిందే. తాజాగా అన్‌‌లాక్-05లో భాగంగా కేంద్రం షూటింగ్‌లకు, సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మూవీ షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. లాక్‌డౌన్ ముందు నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీష్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్‌లో షూటింగ్‌లో నాని పాల్గొన్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత ఏపీలోని తూర్పు గోదావరికి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story