- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రెగ్నెంట్’ గా బిగ్ బాస్ సోహైల్
దిశ, సినిమా : తెలుగు బిగ్ బాస్ ‘సీజన్ 4’ టైటిల్ విన్నర్ సయ్యద్ సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ పేరుతో సినిమా చేస్తున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపురెడ్డి అప్పిరెడ్డి, రవి రెడ్డి సజ్జల నిర్మిస్తున్న చిత్రం ద్వారా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంట్రెస్టింగ్, యూనిక్ స్టోరీ లైన్‌తో ఎక్స్‌పరిమెంటల్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమాలో సోహైల్ ప్రెగ్నెంట్ రోల్ పోషిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక సోహైల్‌కు జోడీగా రూప కొడవయూర్ నటిస్తున్న మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా, వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అసలు విషయానికొస్తే ‘ప్రెగ్నెంట్ మూవీ’ ఫస్ట్ గ్లింప్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన నేచురల్ స్టార్ నాని.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Wishing the team of #MrPregnant all the very best 👍🏼
Here’s the glimpse https://t.co/QGNdnlMzRh@Ryansohel@roopakoduvayur
@svinjanampati @appireddya@ajusatin (nizarshafi)— Nani (@NameisNani) September 5, 2021
ఇందులో ప్రెగ్నెంట్‌గానే కనిపించిన సోహైల్.. ‘కడుపుతో ఉన్నాను, ఈ టైమ్‌లో ఫైట్ ఏంటి?’ అని రౌడీలతో చెప్పే డైలాగ్ సినిమా స్టోరీపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, అలీ, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.