డెలివరీ బాయ్ గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?

by Y.Nagarani |
డెలివరీ బాయ్ గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మన అరచేతిలో ఉన్న ఆరంగుళాల ఫోన్ లో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. నిమిషాల్లోనే మనముందుంచే రోజులివి. ఒకానొకప్పుడు బిర్యానీ తినడం అంటే.. నెలకోసారి ఏ రెస్టారెంట్ కో వెళ్లేవారు. కానీ ఇప్పుడు.. ఫుడ్ డెలివరీ యాప్స్ పుణ్యమా అని రోజూ తినేస్తున్నారు. ఒక్క బిర్యానీయే కాదు.. ఏ ఫుడ్ కావాలన్నా ఫుడ్ డెలివరీ యాప్స్ మనముండే ప్లేస్ లకే సప్లై చేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ అనగానే తొలుత గుర్తొచ్చేది జొమాటో. ఇప్పుడు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ కు చేదు అనుభవం ఎదురైంది. డెలివరీ బాయ్ గా వెళ్లిన తనను లిఫ్ట్ లోకి అనుమతించలేదని పేర్కొన్నారు.

జొమాటో డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గురుగ్రామ్ లో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. సెకండ్ ఆర్డర్ ను తీసుకునేందుకు ఓ మాల్ లోకి వెళ్తుండగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తనను లిఫ్ట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, మెట్ల మార్గంలో వెళ్లాలని చెప్పారని పేర్కొంటూ ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. హల్దీరామ్స్ లో ఆర్డర్ ను పిక్ చేసుకునేందుకు మాల్ కు వెళ్లగా తనకు ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. తాను మెట్ల మార్గంలోనే మూడవ అంతస్తుకు వెళ్లి ఆర్డర్ తీసుకుని వెళ్లానని తెలిపారు. ఈ సంఘటనతో డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్ తో కలిసి జొమాటో మరింత క్లోజ్ గా పనిచేయాల్సి ఉందన్న విషయం తనకు అర్థమైందని పేర్కొన్నారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని చెప్పండని నెటిజన్లను కోరారు.

Advertisement

Next Story

Most Viewed