- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yunus: హసీనా ప్రతీ సంస్థనూ నాశనం చేసింది.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ (Mohammad Yunus) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheik haseena)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హసీనా ప్రతీ సంస్థనూ నాశనం చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థలో సంస్కరణల తర్వాతే దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ జపాన్ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘హసీనా 15 ఏళ్ల పాలనలో దేశ పాలనా నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది. ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా దానిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్‌లో హసీనాపై విచారణ జరుగుతోందని, విచారణ ముగిసి తీర్పు వెలువడిన తర్వాత ఆమెను అప్పగించాల్సిందిగా అధికారికంగా భారత్‌ను అభ్యర్థిస్తామన్నారు. రెండు దేశాలు సంతకం చేసిన అంతర్జాతీయ చట్టానికి భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగానే ఉన్నారని ఈ అంశంపై భారత్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.