- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Controversy: పేరెంట్స్ అది చేస్తుంటే చూస్తావా? యూట్యూబర్ వ్యాఖ్యలు దుమారం..

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ‘ఇండియా గాట్ లాటెంట్’ (India’s Got Latent) షోలో యూట్యూబర్ రణ్‌వీర్ పేరెంట్స్ లైంగిక సంబంధంపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో చూస్తావా? అంటూ ఆయన అడిగిన ప్రశ్నపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముంబాయి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Maharashtra CM Devendra Fadnavis) స్పందించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై సీఎం మాట్లాడుతూ.. హద్దులు దాటిన వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
ఏమైందంటే?
కమెడియన్ సమయ్ రైనా (Samay Raina) నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ మఖీజా (Apoorva Mukhija) పాల్గొన్నారు. ఇటీవల వీరు షో లో మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రణ్‌వీర్ ఒక కంటెస్టెంట్‌కి వేసిన ఆ ప్రశ్న వివాదస్పదమైంది. ‘మీ పేరెంట్స్ శృంగారంలో పాల్గొనడాన్ని జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి జాయిన్ అయి.. జీవితం మొత్తం చూడకుండా ఉంటావా?’ అని రణ్‌వీర్ ప్రశ్న వేస్తాడు. ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బూతులు మాట్లాడటమే కామెడీ అనుకుంటున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా వివాదంపై రణ్‌వీర్ స్పందించారు. ఈ క్రమంలోనే అందరికీ క్షమాపణలు చెప్పారు.