- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
You tube: యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దిశ, నేషనల్ బ్యూరో: యూట్యూబ్‌లో వస్తున్న అశ్లీల కంటెంట్‌పై సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నియంత్రణ లేకపోవడంతో యూట్యూబర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. అసభ్య కంటెంట్‌ను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్లబ్ చేయాలని కోరుతూ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూట్యూబ్ కంటెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టైతే చాలా సంతోషకరమని తెలిపింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుని నియమ నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌పై నియంత్రణ లేకపోవడంతో యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడింది. అలాగే అశ్లీల కంటెంట్‌ను కంట్రోల్ చేయడానికి కోర్టుకు సహాయం చేయాలని అటార్నీ జనరల్ వెంకట రమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. తదుపరి విచారణకు ఇద్దరూ హాజరుకావాలని కోరింది.
యూట్యూబర్ రణవీర్‌పై ఆగ్రహం
ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై అత్యున్నత న్యాయస్థానం పైర్ అయింది. మనసులో ఉన్న మురికిని షోలో వాంతి చేసుకున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అని మండిపడింది. ఈ వ్యాఖ్యల వల్ల తల్లిదండ్రులే గాక ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయొద్దని ఆదేశించింది. పాస్‌పోర్ట్‌ను మహారాష్ట్రలోని థానే పోలీసులకు అప్పగించాలని, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా విడిచి వెళ్లొద్దని తెలిపింది. కాగా, షోలో భాగంగా రణవీర్ తల్లిదండ్రులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై మహారాష్ట్ర, అస్సాం సహా పలు చోట్ల అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఒకే చోట చేర్చాలని రణవీర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.