నిన్న మోడీ నేడు కేజ్రీవాల్.. ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్స్ వార్!

by Anjali |
నిన్న మోడీ నేడు కేజ్రీవాల్.. ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్స్ వార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ వార్ తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో వెలిసిన పోస్టర్లను పోలీసులు తొలగించిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనం ఇవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా వెలుగు చూసిన పోస్టర్లలో 'కేజ్రీవాల్ అవినీతి నియంత', 'కేజ్రీవాల్ హఠావో.. ఢిల్లీ బచావో' అనే నినాదాలు కనిపించాయి. అంతకు ముందు మంగళవారం పీఎం మోడీ టార్గెట్ గా 'మోదీ హఠావో దేశ్ బచావో' నినాదాలతో అతికించిన పోస్టర్లను పోలీసులు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ, ఆమ్ ఆద్మీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకం వెలిసిన పోస్టర్లపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని పోస్టర్లకే భయపడుతున్నాడని సెటైర్లు వేసింది. అయితే ఈ పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. కనీసం నిరసన తెలిపింది తామే అనే చెప్పే ధైర్యం కూడా ఆప్ కు లేదని బీజేపీ ఎటాక్ ప్రారంభించింది. ఇంతలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించడం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Next Story

Most Viewed