- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంగలో మునిగినా శిండే చేసిన పాపం తొలిగిపోదు

- మహారాష్ట్రకు నమ్మక ద్రోహం చేశాడు
- మా పార్టీకి రాముడి గురించి బోధించాల్సిన అవసరం లేదు
- మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే
దిశ, నేషనల్ బ్యూరో: గంగలో మునిగినా మహారాష్ట్రకు చేసిన నమ్మక ద్రోహమనే పాపం ఏక్‌నాథ్ శిండేకు తొలగిపోదని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. తన పార్టీకి నయా హిందుత్వవాదులు వచ్చి రాముడి గురించి బోధించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. మరాఠీ భాషా గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ శిండే వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే, శివసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శిండే మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీల కుటుంబాలు కుంభమేళాకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కుంభమేళాకు వారు వెళ్లకపోవడాన్ని శిండే తప్పుబట్టారు. కాగా, శిండే వ్యాఖ్యలకు మాజీ సీఎం ఉద్ధవ్ స్పందించారు. వారు గంగలో మునిగినా.. మహారాష్ట్రకు చేసిన నమ్మక ద్రోహమనే పాపాలు ఎప్పటికీ తొలగిపోవని అన్నారు. నేను గంగా నదిని గౌరవిస్తాను. కానీ రూ.50 కోట్లు తీసుకున్న వ్యక్తి, మహారాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి అందులో ఎన్నిసార్లు మునిగినా పవిత్రుడు కాలేరు కదా అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.