- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనివ్వం.. చండీగఢ్ మేయర్ ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీం ఆగ్రహం
దిశ, నేషనల్ బ్యూరో : చండీగఢ్ మేయర్ ఎన్నికలను నిర్వహించిన రిటర్నింగ్ అధికారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘‘ఎన్నికలను నిర్వహించే తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పోకడే. దీన్ని మేం నిలువరించి తీరుతాం. ఆ అధికారిపై దర్యాప్తు జరగాలి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రవర్తనను చూసి మేం ఆందోళన చెందుతున్నాం. ఆయన కెమెరాను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఆయన బ్యాలెట్ పేపర్లను మారుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆయన్ను గమనిస్తోందని ఆ అధికారికి చెప్పండి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కామెంట్ చేశారు.చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపర్చాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 7న తలపెట్టిన తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సూచించింది.