- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళా జర్నలిస్ట్‌లకు పెరుగుతున్న సైబర్ బెదిరింపులు
దిశ, నేషనల్ బ్యూరో: తమ పనిలో భాగంగా మహిళా జర్నలిస్ట్‌లు ఆన్‌లైన్‌లలో ఎక్కువ బెదిరింపులను ఎదుర్కొంటున్నట్టు ఇటలీలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్ (ICFJ) రీసెర్చ్ డైరెక్టర్ జూలీ పోసెట్టి మాట్లాడుతూ, మహిళా జర్నలిస్ట్‌లకు ఆన్‌లైన్‌లో అవమానాలు, సెక్సిస్ట్, లైంగిక వ్యాఖ్యలు, వారి కుటుంబాలను చంపేస్తామని వంటి బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ఇలాంటివి ఇటీవల కాలంలో మరింత పెరిగాయి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొందరు, మహిళా జర్నలిస్ట్‌ల ప్రైవేట్ ఫొటోలను ప్రచురించడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ముఖాన్ని మార్చడం "డీప్ ఫేక్‌లు" సృష్టించడం, ఫేక్ నకిలీ లైంగిక చిత్రాలను సృష్టించడం వంటివి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే, శరీర రంగు, మతం లేదా లైంగిక ధోరణికి సంబంధించిన వివక్ష, హింసాత్మక బెదిరింపులు కూడా పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు.
2022లో యునెస్కో/ICFJ సంయుక్త అధ్యయనంలో, 125 దేశాలకు చెందిన 900 మంది జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేయగా దాదాపు మూడొంతుల మంది మహిళా జర్నలిస్టులు తమ పనికి సంబంధించి ఆన్‌లైన్ హింసకు గురయ్యారు. BBC కి చెందిన మరియానా స్ప్రింగ్‌ను గత సంవత్సరం కిడ్నాప్ చేస్తానని/ ఆమె గొంతు కోస్తామని ఎక్స్‌లో బెదిరించారు. కొన్ని సందర్భాల్లో, ఆన్‌లైన్ బెదిరింపులు శారీరక హింసగా మారుతున్నాయని జూలీ పోసెట్టి అన్నారు. దీంతో చాలా మంది మహిళా జర్నలిస్ట్‌లు పరిశ్రమ నుండి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంటున్నారని తెలిపారు.
ఫ్రెంచ్ జర్నలిస్ట్ నదియా దామ్, 2017లో ఒక వార్త కారణంగా బెదిరింపులు రావడంతో అప్పటి నుండి, రెండుసార్లు ఇల్లు మారింది, సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది, కానీ తనకు ఇప్పటికీ సైబర్-బెదిరింపు సందేశాలు వస్తున్నాయని పేర్కొంది. సున్నితమైన కథనాన్ని ప్రచురించే ముందు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అన్ని అంశాలను సమీక్షిస్తున్నాము, సైబర్ బెదిరింపులను పరిష్కరించడానికి కఠిన నిబంధనలు తీసుకురావాలని జూలీ పోసెట్టి కోరారు.