ప్రియుడిని చంపి ముక్కలు చేసిన సెక్స్ వర్కర్

by S Gopi |
ప్రియుడిని చంపి ముక్కలు చేసిన సెక్స్ వర్కర్
X

చెన్నై: ఓ ప్రియుడు తన ప్రియురాలి చేతిలో ఘోరమైన హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పనిచేసే 29 ఏళ్ల వ్యక్తిని అతని ప్రియురాలు మరో ముగ్గురితో కలిసి హత్య చేసింది. అంతేకాకుండా అతని శరీరాన్ని ముక్కలు చేసి 400 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి కొవలంలో కాల్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 38 ఏళ్ల భాగ్యలక్ష్మి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పురుషుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నైలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో థాయ్ ఎయిర్‌వేస్‌లో ఎం జయంతన్ అనే వ్యక్తి గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. అతను మార్చి 18న తన సోదరికి ఫోన్ చేసి పుట్టిన ఊరు విల్లుపురమ్‌కు వెళుతున్నట్టు చెప్పాడు. కానీ అతను అక్కడికి చేరుకోలేదు సరికాదా అతని ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చింది. దీంతో అతని సోదరి 41 ఏళ్ల పి జెయక్రుబ మార్చి 21న మిస్సింగ్ కేసు పెట్టింది. ఈమె వృత్తిపరంగా మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. జయంతన్ కాల్ రికార్డ్స్‌ను బట్టి అతడిని పుదుకొట్టయ్‌లో గుర్తించారు పోలీసులు. కాల్ రికార్డ్స్ ఆధారంగా భాగ్యలక్ష్మి అనే మహిళను కనుగొన్నారు. ఈమె సెక్స్ వర్కర్. 2020 మేలో తొలిసారి వీరిద్దరు తాంబరంలోని లాడ్జ్‌లో కలిశారు. తర్వాత వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. కుటుం సభ్యులకు తెలియకుండా విల్లుపురం సమీపంలోని ఆలయంలో జయంతన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2021 జనవరిలో వీరిద్దరు విడిపోయారు. మరి ఆమె ఇతడిని చంపడానికి కారణమేంటో తెలియలేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed