Pune Rode Attack: కారు ఓవర్ టేక్ కు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి

by Prasad Jukanti |
Pune Rode Attack: కారు ఓవర్ టేక్ కు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డుపై కారుకు ఓవర్ టేక్ చేసేందుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఓ మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా అమానుష రీతిలో దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకుని ముక్కుపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో మహిళ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. మహారాష్ట్ర పూణెలోని బనెర్-పాషన్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై సదరు మహిళ తన పిల్లలతో కలిసి వెళ్తోంది. ఆమె వెనకాలే కారులో వచ్చిన స్వప్నిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా ఆమెను ఓవర్ టేక్ చేశారు. వెంటనే కోపంతో కారు దిగి స్కూటీపై ఉన్న మహిళపై దాడికి తెగబడ్డాడు. అకస్మాత్తుగా తనపై ఎందుకు ఈ దాడి జరుగుతుంతో అర్థం చేసుకునేలోపే ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియోను బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఈ నగరంలో భద్రత ఉందా అని ప్రశ్నించింది. తనకు జరిగిన ఈ ఘటన రేపు మరొకరికి జరగొచ్చని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడితో పాటు కారులో ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు. కాగా ఇటీవలే ఇదే పూణే నగరంలో పోర్షే కారులో వేగంగా వెళ్తున్న ఓ మైనర్ బాలుడు బైక్ ను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఈ మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed