DK Shivakumar : బీజేపీ హయాంలోనే ‘ముడా’ స్కాం : డీకే శివకుమార్

by Hajipasha |
DK Shivakumar : బీజేపీ హయాంలోనే ‘ముడా’ స్కాం : డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ హయాంలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలేవీ జరగలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీ హయాంలోనే అవకతవకలు జరిగాయని.. అప్పట్లో జరిగిన ప్లాట్ల కేటాయింపు వివరాలతో త్వరలోనే జాబితాను విడుదల చేస్తామన్నారు. కర్ణాటక అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈవివరాలను వెల్లడించారు. బీజేపీ లేవనెత్తిన ప్రతీ కుంభకోణం అభియోగాలపై దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని డీకే శివకుమార్ గుర్తుచేశారు. పాలనా కాలంలో చేసిన తప్పులకు బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ముడాకు చెందిన 14 విలువైన ప్లాట్లను భార్యకు కేటాయించుకున్న కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. 2013లో ఎన్నికల సంఘానికి సీఎం సిద్ధరామయ్య సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ప్లాట్ల వివరాలను ప్రస్తావించలేదన్నారు. ‘‘2018లో సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ప్లాట్ల విలువ రూ.25 లక్షలుగా సిద్దరామయ్య పేర్కొన్నారు. 2023లో సమర్పించిన అఫిడవిట్‌లో వాటి విలువ రూ.25 కోట్లు అని ప్రస్తావించారు’’ అని కేంద్రమంత్రి తెలిపారు.



Next Story