Siddaramaiah:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మోడీకి సిద్ధరామయ్య సవాల్

by Shamantha N |
Siddaramaiah:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మోడీకి సిద్ధరామయ్య సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఎక్సైజ్ శాఖలో స్కాం జరిగిందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్‌ చేశారు. ఆరోపణనలు నిజమని రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని (down from politics) ప్రకటించారు. నిరూపించలేకపోతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ‘మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి పాల్పడిందని మోడీ ఆరోపించారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు రూ.700 కోట్లు సమీకరించిందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధానే ఇన్ని అబద్ధాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోతున్నాను. ప్రధానికి నేనో సవాల్‌ విసురుతున్నా. ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించకపోతే ఆయనే పాలిటిక్స్‌ నుంచి తప్పుకోవాలి’ అని సిద్ధరామయ్య అన్నారు.

మోడీ ఏమన్నారంటే?

కాగా, రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ(PM Modi) మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఆ సొమ్మును మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. ‘ఎక్కడ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ రాష్ట్రం కాంగ్రెస్‌ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ రాజ కుటుంబానికి తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాలు ఏటీఎంలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నది. మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకలోని లిక్కర్‌ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.’ అని మోడీ ఆరోపించారు. దీనిపైనే సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed