Israel: హమాస్ నేత హనియేను మేమే చంపాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన

by Shamantha N |
Israel: హమాస్ నేత హనియేను మేమే చంపాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ (Hamas) నేత ఇస్మాయిల్‌ హనియే (Ismail Haniyeh) హత్య తామే చేశామని ఎట్టకేలకు ఇజ్రాయెల్(Israel) అంగీకరించింది. ఈ విషయాన్ని టెల్‌అవీవ్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ బయటపెట్టారు. ‘ఇటీవల కాలంలో హూతీ (Houthis) ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తుంది. నేను వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్‌, హెజ్‌బొల్లా (Hezbollah)లను ఓడించాం. ఇరాన్‌ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ పాలనను పడగొట్టాం. మేం చెడుపై తీవ్రంగా పోరాడి గెలిచాం. యెమెన్‌లోని హూతీ((Houthis))లకు కూడా గట్టి దెబ్బ తప్పదు. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీశాం. హనియే, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. గత ఏడాది కాలంగా పాలస్తీనియన్లకు మద్దతుగా నిలిచాం’ అని కాట్జ్‌ చెప్పుకొచ్చారు.

ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణలు

ఇకపోతే, గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 251 మంది కిడ్నాప్‌ అయ్యారు. వీరిలో కొందరిని విడిపించగా.. మరికొందరు చనిపోయారు. ఇప్పటికీ దాదాపు వంద మంది హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు. కాగా.. ఇరాన్ (Iran)రాజధాని టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియే.. అదే నగరంలో హత్యకు గురయ్యాడు. ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ పేర్కొన్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed