Foreign Diplomats : విదేశీ రాయబారులకు భారత్‌లోనే అత్యంత స్వేచ్ఛ

by Hajipasha |
Foreign Diplomats : విదేశీ రాయబారులకు భారత్‌లోనే అత్యంత స్వేచ్ఛ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలకు ఉండే స్వేచ్ఛ గురించి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లను వేధించడం, రహస్య నిఘా పెట్టడం లాంటివి తమ దేశంలో ఉండవని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లోని ప్రతిపక్ష నేతలతో విదేశాల దౌత్యవేత్తలు భేటీ అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయదని తేల్చి చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో విదేశాల దౌత్యవేత్తలకు తగినంత స్వేచ్ఛ ఉంటుందన్నారు.ఈనెల 13న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్.జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత నెలలో అమెరికా దౌత్యవేత్తల టీమ్ శ్రీనగర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఉమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు., ఈ ఏడాది మే నెలలో భారత్‌లో చైనా రాయబారిగా షు ఫీహాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జూన్ నెలలో ఆయన సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతో సమావేశమయ్యారు. పాకిస్తాన్, ఇరాన్, చైనా, కెనడా లాంటి దేశాల్లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలపై నిఘా పెడుతుంటారు.

Advertisement

Next Story

Most Viewed