S Jaishankar on border dispute: భారత్, చైనాది క్లిష్టమైన చరిత్ర

by Shamantha N |
S Jaishankar on border dispute: భారత్, చైనాది క్లిష్టమైన చరిత్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో భారత్ సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్- చైనాది క్లిష్టమైన చరిత్ర అని చెప్పుకొచ్చారు. తాను 75 శాతం పరిష్కారం అయ్యాయని తెలిపింది బలగాలు వెనక్కి తగ్గిన విషయంలోనే అని వెల్లడించారు. ఇది ఉన్న సమస్యల్లో ఒక భాగమని తెలిపారు. ఆసియా సొసైటీ పాలసీ ఇన్ స్టిట్యూట్ లో విదేశాంగమంత్రి ప్రసంగించారు. చైనా, భారత్ మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ కొవిడ్ సమయంలో డ్రాగన్ బలగాలు సరిహద్దు రేఖ దగ్గర ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అన్నారు. అది చివరకు ఘర్షణలకు దారితీసిందన్నారు."చైనాతో మనకు క్లిష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్ తో స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ కోవిడ్ సమయంలో ఒప్పందాలను ఉల్లంఘించి బలగాలు సరిహద్దుల్లో మోహరించడాన్ని చూశాం. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టే, అక్కడ ఘర్షణ జరిగింది. ఇరువైపులా అనేక మంది సైనికులు మరణించారు ”అని జైశంకర్ అన్నారు.

డీ ఎస్కలేషన్ అవసరం

ప్రధాన ఘర్షణ పాయింట్ల దగ్గర వివాదాన్ని పరిష్కరించుకున్నామని వివరించారు. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ హక్కులను నిర్ణయించడంలో సవాళ్లు కొనసాగుతున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి "డీ ఎస్కలేషన్" అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఇంకా పెట్రోలింగ్ సమస్యలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చైనా, భారత్ మధ్య సత్సంబంధాలు "ఆసియా భవిష్యత్తుకు కీలకం" అని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయంగా అస్థిరతను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని అన్నారు.

Next Story

Most Viewed