రాష్ట్రంలో 80 వేలకు పైగా పోలీసులు ఉండి ఏం చేస్తున్నారు... హైకోర్టు ఆగ్రహం

by S Gopi |
రాష్ట్రంలో 80 వేలకు పైగా పోలీసులు ఉండి ఏం చేస్తున్నారు... హైకోర్టు ఆగ్రహం
X

చంఢీగఢ్: పంజాబ్ పోలీసులపై ఆ రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఖలిస్తానీ నేత అమృత్ పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు చేపట్టిన అపరేషన్ నివేదికను సమర్పించాలని మంగళవారం కోరింది. రాష్ట్రంలో 80 వేలకు పైగా పోలీసులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకుంటారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమని కోర్టు పేర్కొంది. అయితే శనివారం నుంచి అమృత్ పాల్ ను పట్టుకునేందుకు చేపట్టిన అపరేషన్‌లో అతడి మద్ధతుదారులను 120 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అమృత్‌పాల్ సింగ్ శనివారం సాయంత్రం చివరిసారిగా మోటార్ సైకిల్‌పై కనిపించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని ఏళ్లుగా సాయుధ మద్ధతుదారులతో సింగ్ యాక్టివ్‌గా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed